ఈ భూకంపం పంగై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల (56 మైళ్లు) దూరంలో సంభవించింది. దీని ప్రభావం నియు ద్వీప దేశం వరకు ఈ భూకంపం విస్తరించి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పసిఫిక్ మహా సముద్రంలో ఉన్నటోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో రిక్టార్ స్కేల్ పై నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూకంపం పంగై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల (56 మైళ్లు) దూరంలో సంభవించింది. దీని ప్రభావం నియు ద్వీప దేశం వరకు ఈ భూకంపం విస్తరించి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నియు , టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి 1 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఫస్ట్ భూకంపం కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని టొంగా అధికారులు ప్రజలకు సూచించారు.
టోంగాలో భూకంపాలు సాధారణం. ఇది తక్కువ ఎత్తులో ఉన్న ద్వీపసమూహం. ఇక్కడ దాదాపు లక్ష మంది మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఆగ్నేసియా గుండా పసిఫిక్ బేసిన్ వరకు విస్తరించి ఉన్న తీవ్రమైన టెక్టోనిక్ కార్యకలాపాల ప్రాంతమైన 'రింగ్ ఆఫ్ ఫైర్' పై ఉంది.