imran khan: నోబెల్ బహుమతికి ఎంపిక అయిన పాకిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి !

పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి.


Published Apr 01, 2025 09:03:00 AM
postImages/2025-04-01/1743478512_20240905T071124Z1520713197RC2ZVZ9Q6O12RTRMADP3PAKISTANPOLITICSKHANMILITARY.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. మానవహక్కులు , ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసి కృషికి ఈ నామినేషన్ లభించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి.


ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో దక్షిణాసియాలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు ఆయన 2019 లోనూ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రతి యేడాది నోబెల్ కమిటీ వందలాది నామినేషన్లను స్వీకరిస్తుంది. అనంతరం ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తుంది.


పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు.  అయితే అధికార దుర్వినియోగం , అవినీతి ఆరోపణలపై ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది.2022 ఏప్రిల్ లో అవిశ్వాస తీర్మానంతో ఆయన అధికారాన్ని కోల్పోయారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pakistan

Related Articles