భూప్రకంపనల ప్రభావం భారత్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మయన్మార్ , థాయ్ లాండ్ ను భూకంపం రెండు సార్లు వచ్చింది. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య దారునంగా పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు 1600 మంది చనిపోయినట్లు అధికారికంగా తెలిపారు. కాని . ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది విలవిల్లాడుతున్నారు. భూప్రకంపనల ప్రభావం భారత్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.
భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్‌లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య దాదాపు 4వేల మందికి పైగానే ఉంది.మయన్మార్‌లోని పలు విమానాశ్రయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. 'ఆపరేషన్ బ్రహ్మ' కొనసాగింపులో భాగంగా సహాయక సిబ్బందిని పంపిస్తున్నామని వెల్లడిస్తూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు దాదాపు 80 మంది ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బందిని మయన్మార్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 'ఆపరేషన్ బ్రహ్మ' కింద 15 టన్నుల సహాయక సామగ్రి మయన్మార్‌కు పంపించింది. తాజాగా మరో రెండు ఐఏఎఫ్ విమానాల ద్వారా సామగ్రిని పంపించేందుకు రెడీగా ఉన్నాయి.