beach బీచ్ లో చెప్పులు లేకుండా నడిస్తే ...కాళ్లే తీసేశారుగా 2024-06-25 03:26:32

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; బీచ్ లో చెప్పులు లేకుండా వాకింగ్ ( walking) చేయడం చాలా మందికి సరదా...నిజానికి చాలా హాయిగా ఉంటుంది కూడా ...చల్లని గాలి...కాళ్లకు చల్లని నీరు..మనసుకు చాలా హాయిగా అనిపించడమే కాదు..స్ట్రెస్ ( stress) మొత్తం పోతుంది. ఓ యువకుడు తనకున్న అదే అలవాటు వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి ప్రాణపాయ స్థితిలోకి చేరుకున్నాడు. అమెరికాలోని ( america) సౌత్ కరోలినా చార్లెస్టన్ లో నివసిచే బ్రెంట్ నార్మన్‌ అనే యువకుడు ప్రతిరోజు దాదాపు 15,000 అడుగులు వాకింగ్ చేసేవాడు. సల్లివన్ ద్వీపం, ఐల్ ఆఫ్ పామ్స్ మధ్య తీరప్రాంతంలో వాకింగ్ చేస్తూ ఉండేవాడు. 

ఓ సముద్రానికి కొట్టుకువచ్చిన గవ్వలు, శంఖాలపై కాళ్లు పెట్టాడు. అదే సమయంలో అతడి కాళ్లకు బ్యాక్టీరియా సోకింది. అది కూడా హానికర బాక్టీరియా ( dangerious) ...ఆ బాక్టీరియా మాంసం తినేస్తుంది. ఇది సోకడం వల్ల అతను అతని కాల్లను కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని రోజుల క్రితం కొన్ని గవ్వలపై కాళ్లు పెట్టినప్పటి నుంచి తన కాల్లలో నొప్పి రావడం మొదలు పెట్టిందని అన్నాడు. తీవ్ర ఆరోగ్య సమస్యలు( health problems)  వచ్చాయని తెలిపాడు. ఆ తర్వాత తన కాళ్లలో వాపు కూడా మొదలైందని, తాను నడవలేకపోతున్నానని చెప్పాడు.

అతడికి విబ్రియో బ్యాక్టీరియా వల్ల వచ్చే విబ్రియోసిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకం కాకపోయినా ...శరీరంలో వ్యాపించి ..మాంసం తినేస్తుందని తెలిపారు. వైద్యులు కష్టపడుతున్నామని ..తర్వాత చూడాల్సిందేనని తెలిపారు.