Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ 2024-06-23 16:00:24

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్పేస్ ఎక్స్ , టెస్లా ( TESLA) కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలీస్ కు మూడో బిడ్డ  పుట్టాడు. దీంతో ఇప్పుడు ఎలాన్ మస్క కు పదకొండు మంది పిల్లలు. మొదటి భార్య జస్టిన్ మస్క్ తో ఎలాన్ మస్క్( ELEN MUSK)  ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. ఆపై భార్యతో విడిపోయిన మస్క్.. మ్యూజిషియన్ గ్రిమెస్ తో డేటింగ్ చేశారు. ఆమెతో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. 


2021 లో షివాన్ జెలీస్( SHIWAN JELIS)  తో మస్క్ సహజీవనం చేశారు. అదే ఏడాది జెలీస్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పట్లో మస్క్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది పిల్లలు లేకుంటే నాగరికత కుంగిపోతుందని, అందుకే తాను పది మంది పిల్లలకు తండ్రయ్యానని చెప్పారు. తాజాగా మరో బిడ్డకు జెలీస్ జన్మనివ్వడంతో మాస్క్ మరో సారి ఇదే డైలాగ్ చెప్తాడంటున్నారు నెటిజన్లు.


2013 లో స్పేస్ ఎక్స్( SPACE X)  కంపెనీలో ఉద్యోగం మానేసిన ఓ మహిళ చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. తన దగ్గర పనిచేసిన ప్రతి మహిళతోను ఎలెన్ సంబంధాలు నడుపుతాడని చెప్పింది.తనకు పిల్లలను కనివ్వాలంటూ మస్క్ ప్రతిపాదించాడని ఆరోపించింది. తన సంస్థలలో పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ కు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి.