అమెరికా మాజీ ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక దుండగుడు 100 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్లు ట్రంప్ చెవి భాగం నుంచి స్పీడ్ గా దూసుకెళ్లాయి. 6 రౌండ్ల కాల్పులు జరిపే సమయంలో మొదటి రెండు రౌండ్ లోనే ట్రంప్ చెవికి తాకి బుల్లెట్ ముందుకెళ్ళిపోవడంతో ఆయన అలర్ట్ అయిపోయి కిందకి వంగి పోయారు. వెంటనే అలెర్ట్ అయినటువంటి సిబ్బంది ట్రంప్ ను సేఫ్ గా ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులు జరిపిన దుండగుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ అంటూ మీడియా కథనాల్లో వస్తోంది. ఆ వ్యక్తికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆయన ట్రంప్ పై కాల్పులు కలపడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటే తనకు అసహ్యం అని, రిపబ్లికన్ పార్టీ అంటే తనకు అసలు ఇష్టం లేదని తెలియజేశారు.
న్యూస్ లైన్ డెస్క్:ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కడ చూసినా గన్ కల్చర్ పెరిగిపోతోంది. రోజుకి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు గన్ తో కాల్చి చంపేస్తున్నారు. ఇది సాధారణ ప్రజలకు జరిగితే ఏమో అనుకోవచ్చు కానీ, అమెరికా మాజీ ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక దుండగుడు 100 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపాడు.
దీంతో ఆ బుల్లెట్లు ట్రంప్ చెవి భాగం నుంచి స్పీడ్ గా దూసుకెళ్లాయి. 6 రౌండ్ల కాల్పులు జరిపే సమయంలో మొదటి రెండు రౌండ్ లోనే ట్రంప్ చెవికి తాకి బుల్లెట్ ముందుకెళ్ళిపోవడంతో ఆయన అలర్ట్ అయిపోయి కిందకి వంగి పోయారు. వెంటనే అలెర్ట్ అయినటువంటి సిబ్బంది ట్రంప్ ను సేఫ్ గా ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత కూడా ట్రంప్ ఎవరికి భయపడేది లేదు అంటూ పిడికిలి బిగించి చేయి పైకెత్తుతూ అభివాదం చేస్తున్నారు.
ఇప్పటివరకు నాలుగు సార్లు జరిగినటువంటి కాల్పుల్లో అమెరికా అధ్యక్షులు నలుగురు చనిపోయారు. అంతేకాకుండా ముగ్గురు అమెరికా అధ్యక్షుడు గాయపడ్డారు. మరో ముగ్గురిపై హత్యాయత్నాలు జరిగాయి. ఇదే తరుణంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. ఈ కాల్పులు జరిపిన దుండగుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ అంటూ మీడియా కథనాల్లో వస్తోంది. ఆ వ్యక్తికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.
ఆయన ట్రంప్ పై కాల్పులు కలపడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటే తనకు అసహ్యం అని, రిపబ్లికన్ పార్టీ అంటే తనకు అసలు ఇష్టం లేదని తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్బీఐ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకొని కాల్పులు జరిపి చంపేశారు. అంతేకాకుండా అతని దగ్గర ఎలాంటి ఐడీ కార్డులు కూడా లభించలేదట.