బ్యాంకాక్ లో రెండుసార్లు తీవ్ర ప్రకంపలు వస్తున్నాయి, బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మయన్మార్ శుక్రవారం వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత7.7 గా నమోదయ్యింది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో రెండుసార్లు తీవ్ర ప్రకంపలు వస్తున్నాయి, బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఇదే ప్రభావం కనిపిస్తుంది.
సెంట్రల్ మయన్మార్ లో మోనివా సిటీకి తూర్పున 50 కిమీ దూరంలో 10 కిమీ లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. బ్యాంకాక్ లో ప్రకంపనలు భారీగా సంభవించాయి. చాలా భవనాల్లో అలారమ్ మోగడం వల్ల ప్రజలు బయటకు పరుగులు తీశారు. అక్కడి ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది.