షేక్ హమ్దాన్ తల్లి షేఖా హింద్ , బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్ధం చిన్నారికి ఈ పేరు పెట్టారు. ఈ విషయాన్ని షేక్ హమ్దాన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ భార్య షేఖా షైఖా బింట్ సయూద్ బిన్ థాని అల్ మక్తౌమ్ గత శనివారం నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డ కు హింద్ అనే పేరు పెట్టారు. హింద్ బింట్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తల్లి షేఖా హింద్ , బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్ధం చిన్నారికి ఈ పేరు పెట్టారు. ఈ విషయాన్ని షేక్ హమ్దాన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
అయితే చిన్నారి ఆరోగ్యం , శ్రేయస్సు కోసం అల్లాహ్ ను ప్రార్దిస్తున్నామని క్రౌన్ ప్రీన్స్ తెలిపారు. అయితే హింద్ అనే పదం అరబిక్ మూలానికి చెందినది. సంపద , కీర్తి ప్రతిష్టలతో ఉండాని కోరుకుంటూ ఈ పేరు పెడుతున్నట్లు తెలిపారు. షేక్ హమ్దాన్ దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేఖా హింద్ లకు రెండో సంతానం.