డీజీ ఐఎస్ పీఆర్ లెఫ్టినెంట్ షరీఫ్ చౌదరి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. 'భారతదేశం సింధు నది నీటిని ఆపివేస్తే, మేము దాని శ్వాసను ఆపివేస్తాము' అంటూ బెదిరింపులకు దిగారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్ ..రేపిన మంట ఇంకా రేగుతుంది. కాల్పుల విరమణ జరిగినా పాకిస్థాన్ వక్రబుధ్ధి మాత్రం మారలేదు. పాకిస్థాన్ ప్రధాని మంత్రిషాబాజ్ షరీఫ్ " ఇక పై భారతదేశం దాడి చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది " అని అన్నారు. ఈ ప్రకటన చేస్తున్నప్పుడు షాబాజ్ షరీఫ్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించినప్పటికీ, అతని స్క్రిప్ట్ పాకిస్తాన్ సైన్యం రాసినదే. అదే సమయంలో, పాకిస్తాన్ డీజీ ISPR కూడా భారత్ ను బెదిరించారు. భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ సైన్యం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయూద్ ను ఉటంకిస్తూ డీజీ ఐఎస్ పీఆర్ లెఫ్టినెంట్ షరీఫ్ చౌదరి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. 'భారతదేశం సింధు నది నీటిని ఆపివేస్తే, మేము దాని శ్వాసను ఆపివేస్తాము' అంటూ బెదిరింపులకు దిగారు.
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయూద్ కొంతకాలం క్రితం ఇచ్చిన ప్రకటన కూడా ఇదే. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. నీటి కొరత కారణంగా పాకిస్థాన్ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం 11 పాకిస్తానీ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. చాలా రన్ వే ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రపంచదేశాలన్నీ భారత్ తో పెట్టుకుంటే పాకిస్థాన్ కు ఏం జరుగుతుందో అర్ధమయ్యింది .