us -china: డియర్ చైనా ..సుంకాలపై మాట్లాడుకుందాం రండి..ట్రంప్ !

టారిఫ్స్ గురించి ఇప్పటి వరకు యూఎస్ తో ఎలాంటి చర్చలు జరుపలేదని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ నిన్న ప్రకటించారు. 


Published May 02, 2025 01:07:00 PM
postImages/2025-05-02/1746171524_im28655164.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సుంకాల పోరు మొదలుపెట్టింది అమెరికానే  . చైనా తక్కువేం కాదు కదా. చైనా కూడా సుంకాల పెంచి టిట్ ఫర్ టాట్ చేసింది. ఇక చేసేది లేక యూఎస్ కబుర్లు పెడుతుంది. చైనా కదిలివస్తే సుంకాల సంగతి మాట్లాడుకుందామంటూ లేఖలు పంపుతుంది. అయితే ఈ విషయాన్ని ఎవరో కాదు చైనీస్ అధికార పత్రిక యుయువన్ టాంటియన్ వెల్లడించింది.  టారిఫ్స్ గురించి ఇప్పటి వరకు యూఎస్ తో ఎలాంటి చర్చలు జరుపలేదని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ నిన్న ప్రకటించారు. 


ప్రతీకార సుంకాలపై కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య వాణిజ్య యుధ్ధం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. చైనా అధ్యక్షుడు తనకు ఫోన్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూ లో అమెరికా సంప్రదింపులు చేస్తుందని తామే ఓ నిర్ణయానికి రావడం లేదని తెలిపింది. నిజానికి గత కొన్నేళ్లుగా వాణిజ్య ఒప్పందా లకు సంబంధించిన వార్తలను చైనా కమ్యూ నిస్టు పత్రిక ది గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డైలీ నివేదిస్తుంటాయి. అయితే అమెరికా మాత్రం చైనా కాళ్ల బేరానికి వస్తున్నట్లు చెబుుతంది. చైనా మాత్రం ట్రంప్ రెండు మాటలు మాట్లాడుతున్నారని చైనాకే లేఖలు పంపుతున్నట్లు చైనా చెబుతుంది. ఎవరిది నిజమో వాళ్లకే తెలియాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america trump china

Related Articles