మణిపూర్ లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని అక్కడ దేశీయ పరిస్థితులే పహల్గామ్ దాడికి కారణమై ఉంటుందని ఆసిఫ్ చెప్పారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జమ్ముూకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో 26 మంది టూరిస్ట్ లు చనిపోయారు. ఈ ఘటన పై పాకిస్థాన్ రియాక్ట్ అయ్యింది. ఈ ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ దారుణమని అన్నారు. కేంద్రప్రభుత్వంపై నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు వ్యతిరేకత ఉందని మణిపూర్ లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని అక్కడ దేశీయ పరిస్థితులే పహల్గామ్ దాడికి కారణమై ఉంటుందని ఆసిఫ్ చెప్పారు.నాగాలాండ్ , మణిపూర్ , కశ్మీర్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని చాలా మందిని ప్రభుత్వం వేధించడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఇది భారత ప్రభుత్వ వైఫల్యమన్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సపోర్టు చెయ్యదని అన్నారు. "మేము ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వము. దీనిపై ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు" అని ఆయన నొక్కి చెప్పారు. దేశీయంగా జరిగినా భారత్ పాకిస్థాన్ పై నిందలు వేయడం పరిపాటిగా మారిందని అన్నారు.