పెళ్లి చేసుకొని లైఫ్ ను హ్యాపీగా గడపాలనుకున్నారట. తను ప్రేమించిన అమ్మాయి జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం..తన జర్నీ లో తను లేకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కోల్ కత్తా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో తన స్నేహితుడు మానసిక వేదనకు గురయ్యాడు. తను ఇఫ్పుడు చనిపోయిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఒకే బ్యాచ్ కు చెందిన వీరు తమ చదువులు కంప్లీట్ అయ్యాక ..పెళ్లి చేసుకొని లైఫ్ ను హ్యాపీగా గడపాలనుకున్నారట. తను ప్రేమించిన అమ్మాయి జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం..తన జర్నీ లో తను లేకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు.
ఇన్ని రోజులు తను కౌన్సిలింగ్ లో ఉన్నానని ..ఇక బాధపడనని ..తన తల్లితండ్రులతో పాటు కలిసి పోరాడతానని తెలిపాడు.తన ఆవేదననంతా కవిత రూపంలో పంచుకున్నాడు. సీఎం మమత వ్యాఖ్యలను ఖండిస్తూ తన దుర్గ న్యాయం అడుగుతోందనీ తాను ఏ వేడుకా చేసుకోలేననీ రాసుకొచ్చాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగి నెల రోజులు దాటిందని, ఇకనైనా ప్రజలు దాన్ని మరిచి దుర్గా పూజలకు సిద్ధం కావాలని ఆమె అన్నారు. దీదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ వైద్యురాలి స్నేహితుడు ఓ కవిత రాశాడు. దాన్ని ఓ ఇంగ్లిష్ మీడియాతో పంచుకున్నాడు.
తన తప్పులేకుండా ఓ మహిళ గుండె పగిలే రీతిలో లైంగిక దాడి జరిగి చనిపోతే ..దుర్గ పూజకు ఎలా సిధ్దమవుతామని ప్రశ్నించాడు. అంతేకాదు నాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండిపోయాడు. ఓ మహిళ సీఎంగా ఉండి..మరో మహిళ పడే వేదనను మరిచిపోమంటుంది. న్యాయం కోసం నగరం అర్ధిస్తుంది. నా దుర్గ న్యాయం కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను వేడుక చేసుకోలేను. తనతో నా జీవితం ఊహించుకున్నాను.నా కలల సౌధం చెదిరిపోయింది. ఇక నేను ఏ పూజలు...ఏ సంతోషాలు జరుపుకోలేనంటు తన బాధను బయటపెట్టాడు.