ఇప్పుడు 11.4 శాతానికి పెరిగింది. ఆగష్టు 2024 లో నమోదైన గరిష్టస్థాయిని మించిపోయిందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటక్షన్ తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోవిడ్ మళ్లీ విజృంభిస్తుంది. ఆగ్నేయాసియా అంతటా ముఖ్యంగాX హాంకాంగ్ , సింగపూర్ లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్ లో కోవిడ్ కేసులు చాలా పెరిగాయని ఆరోగ్య అధికారులు నివేదించారు. హాంకాంగ్ లో నగరంలో కొత్త కోవిడ్ వేర్ విజృంభిస్తుంది. ఇన్ఫెక్షన్ రేటు మార్చి మధ్యలో 1.7శాతం నుంచి ఇప్పుడు 11.4 శాతానికి పెరిగింది. ఆగష్టు 2024 లో నమోదైన గరిష్టస్థాయిని మించిపోయిందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటక్షన్ తెలిపింది.
కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల స్థాయి చాలా ఎక్కువగా పెరిగిందని అన్నారు అక్కడ అధికారులు తెలిపారు. ఇటీవల కోవిడ్ పాజిటివ్ టెస్టుల సంఖ్య గత ఏడాదిలో అత్యధికంగా కనిపించింది.డేటా ప్రకారం.. గత ఏడాదిలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా అత్యధిక స్థాయికి చేరుకుంది. హాంకాంగ్ జనాభా 7 మిలియన్లకు పైగా ఉంది. మే 3 వరకు వారంలో మొత్తం 31 తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. గతంలో ఉన్నంత దారుణంగా లేకపోయినా..ఈ సారి కూడా చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుంది.మురుగునీటిలో వైరస్ పరిమాణం పెరగడం, ఆసుపత్రిలో చేరడం, కేసుల సంఖ్య పెరగడం, వైరస్ వేగంగా వ్యాపిస్తోందని సూచిస్తోంది.