special tree: ప్రపంచంలోనే అరుదైన జాతి చెట్లు ఇవే..ఒక్కో చెట్టుకు వందఎకరాలు 2024-06-19 15:04:15

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అందరు చెప్తుంటారు...చెట్లు పెంచండి..మొక్కలు పెంచండి అని ..కాని కొన్ని అరుదైన చెట్లు పెంచాలంటే మాత్రం మానవుల తరం కాదు.. వాటిని మనం పెంచలేం ..పోషించలేం. అలాంటి వాటిని ప్రకృతే ఎంచుకొని ..ఎంపిక చేసుకొని మరీ అడవుల్లో అరుదైన చోట్ల పెంచుకుంటుంది. అవేంటో చూద్దాం.


కొన్ని చెట్లు పెరగాలంటే మినమమ్.. 2 ఎకరాలు ఉండాలి. డ్రాగన్ ట్రీ అని పేరు గల చెట్టు కూడా తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంతేకాదు. మరికొన్ని చెట్లను సంవత్సరాలుగా మనుషులు ముట్టుకోలేదు. మరికొంటిని మనుషులే కావాల్సిన రితీలో తీర్చిదిద్దారు. అాలాంటి వాటి కోసం మనం తెలుసుకోవాల్సిందే.


బ్రెజిల్‌లోని పియాంగి( piyangi jeedi chettu) జీడి చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద జీడి చెట్టు. బ్రెజిల్‌లోని( brezil natal)  నాటల్ సమీపంలో ఉన్న ఈ చెట్టు 177 సంవత్సరాల వయస్సు. ఈ ఒక్క చెట్టు ఏడాదికి 8 వేల ఫలాలను ఇస్తుంది. మొత్తం రెండు ఎకరాల్లో ఉంటుంది.దాని వేర్లు నేలను కూడా తాకుతాయి. చాలా ప్రాంతాలనుంచి ప్రజలు దీన్ని చూడడానికి కడా వస్తారు.
బాబాబ్‌ను టీపాట్ చెట్టు( babbab teapat tree)  అని కూడా అంటారు. ప్రపంచంలో అడాన్సోనియా యొక్క 9 జాతులు ఉన్నాయి, వాటిలో 6 మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాయి. ఈ చెట్లు వెయ్యి సంవత్సరాల వయస్సు, దీని ఎత్తు 16 నుండి 98 అడుగుల వరకు ఉంటుంది. వీటి కాండం 23-36 అడుగుల పొడవు ఉంటుంది. ఈ చెట్టు భారీ సైజు లో ఉండడం ఒక వింత అయితే చెట్లు మధ్యలో అంతా భారీ సైజు వాటర్ ట్యాంక్ ఉంటుంది. అంత నీటిని దాచిపెట్టుకుంటుంది. ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నా...కొన్ని ప్రమాదకరమైనవని తెలిపారు.