Rohingya: మయన్మార్ లో రహింగ్యా శరణార్ధుల 427 మంది జలసమాధి !

ఇదే కాని నిజమైతే సముద్రంలో జరిగిన అత్యంత ప్రమాదమైన యాక్సిడెంట్స్ లో ఇది కూడా ఒకటి. 


Published May 24, 2025 05:24:00 PM
postImages/2025-05-24/1748087780_20240321T061331Z2124869948RC26Q6A6H8OMRTRMADP3MIGRATIONROHINGYAINDONESIA1711075543.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మయన్మార్ తీర ప్రాంతంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. రోహింగ్యా శరణార్ధులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా జరిగినట్లు ఏ ప్రభుత్వం ..అధికారులు క్లియర్ గా తెలపలేదు. ఇదే కాని నిజమైతే సముద్రంలో జరిగిన అత్యంత ప్రమాదమైన యాక్సిడెంట్స్ లో ఇది కూడా ఒకటి. 


మయన్మార్‌లో నివసించే రోహింగ్యాలు అనేక సంవత్సరాలుగా వివక్షకు, హింసకు గురవుతున్నారు. 2017 లో మయన్మార్ సైన్యం చేపట్టిన కఠిన చర్యల కారణంగా లక్షలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్ మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం, రోహింగ్యాలపై దాడులు, అణచివేత మరింత పెరిగాయి. 


ఐక్యరాజ్య సమితి అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మే 9వ తేదీన జరిగిన మొదటి ప్రమాదంలో ఒక నౌక మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 267 మందిలో కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడి ఉంటారని తెలిపింది. మిగిలిన వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత మే 10 వ తేదీన మరో నౌక కూడా ఇలానే ప్రమాదానికి గురయ్యింది. ఈ రెండో నౌకలో ఉన్న వారిలో 21 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరారని సమాచారం.  బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఇప్పటికే కిక్కిరిసిపోయిన జనాభా, అక్కడి దుర్భర పరిస్థితుల కారణంగా అనేకమంది రోహింగ్యాలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే, వారు ఏజెంట్ల మాటలు నమ్మి, ప్రమాదకరమైన సముద్ర మార్గాల ద్వారా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు చేరుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రయాణాల్లోనే తరచూ ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu national sea mayanmar death

Related Articles