ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టాయి. భారీ సంఖ్యల అంబులెన్స్ లు అక్కడికి చేరాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినాలోని ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. లిటిర్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 930 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు పెట్టాల్సి వచ్చింది.ఈ దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిచినట్లు హారీ కౌంటీ పోలీసులు వెల్లడించారు.
వెంటనే అత్యవసర విభాగాలు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టాయి. భారీ సంఖ్యల అంబులెన్స్ లు అక్కడికి చేరాయి. నివాస సముదాయాల మధ్య ఎవరు కాల్పులు జరిపారనే విషయాలు మాత్రం తెలీలేదు. ఈ మధ్యే సౌత్ కరోలినాలోని ప్రసిధ్ధ పర్యాటక ప్రాంతమైన మిర్టిల్ బీచ్ లో దుండగులు కాల్పులకు పాల్పడటంతో ఓ వ్యక్తి మరణించాడు.11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో నార్త్ ఓషన్ బౌలేవార్డ లో ఓ వ్యక్తి ప్రజలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించినట్లు అధికారులు తెలిపారు.