ప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో సర్కార్.. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ ల సేవలపైనా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కెనడాలో ఫుడ్ బ్యాంక్ బ్యాన్ చెయ్యడం ...ఎంతో మంది విద్యార్ధులకు వెరీ సాడ్ న్యూస్ . కొంతమంది దీనిని దుర్వినియోగం చేస్తున్నారు కాని ..దాదాపు విద్యార్ధులకు ఇవి చాలా ఇంపార్టెంట్. లక్షలు పెట్టి చదువుకుంటున్నవారికి ...ఈ ఫుడ్ బ్యాంక్ ఎంతో కొంత ఆసరా . ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో సర్కార్.. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ ల సేవలపైనా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్ బ్యాంకు నిర్ణయించింది. ఫుడ్ రేట్లు పెరిగాయి. నిరుద్యోగం కూడా పెరుగుతుంది.
కెనడాలో జీవన వ్యయ భారం భారీగా పెరిగింది. దీంతో అక్కడ ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. టైంకి పార్ట్ టైం జాబ్స్ దొరకడం లేదు. స్థానిక మీడియా ప్రకారం మార్చిలో 20 లక్షల మంది ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారు. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 6 శాతం పెరిగారు. ఐదేళ్ల క్రితం తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు డబుల్. ఇంత ఖర్చు ప్రభుత్వంపై భరించలేనిదిగా ట్రూడో ప్రభుత్వం చెబుతుంది.
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ప్రభుత్వం ఇటీవల రెట్టింపు చేసింది. 10వేల డాలర్లుగా ఉన్న స్టూడెంట్ డిపాజిట్‌ను జనవరి 1 నుంచి 20,635 డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యంలో మొదటి ఏడాది విద్యార్థులకు.. ఫుడ్ బ్యాంకు సౌలభ్యం దూరం చేయడాన్ని.. ది గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంకు సమర్థించుకుంటోంది. నిజానికి కొత్తగా వచ్చినవారికే ఈ సౌకర్యం చాలా సాయం చేస్తుందని రెండో ఏడాదికి కాస్త తాము ఉన్న సిటీ అలవాటు అవుతుందని అంటున్నారు విద్యార్థులు.