స్కూల్ వారికి డబ్బులు కావాలి. జాగ్రత్తలు కాదు. రీసెంట్ గా థాయ్ లాండ్ లో స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించాలంటే భయంగా ఉంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కొంత ...ప్రమాదాలు కొంత ఏది ఏమైనా పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. స్కూల్ వారికి డబ్బులు కావాలి. జాగ్రత్తలు కాదు. రీసెంట్ గా థాయ్ లాండ్ లో స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో చిక్కుకొని 25 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర విషాదం థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. బ్యాంకాక్‌లోని సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి విహారయాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. దట్టమైన మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగిన విషయం తెలుసుకునే లోపే ...బస్సు సీట్లు తగలబడడం మొదలయ్యాయి. దీంతో మంటలు చిన్నారులను దహించేశాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44మంది ఉన్నారట. ఈ ప్రమాదం నుంచి 16మంది విద్యార్థులను, ముగ్గురు టీచర్లను కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. వీరంతా బ్యాంకాక్ నుంచి సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్‌కు విహారయాత్ర వెళ్లారని ఆయన తెలిపారు.టూర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.