ఇజ్రాయిల్ దాడిలో బీరూట్ లో ఓ అపార్ట్ మెంట్ ధ్వంసం అయ్యింది ఎంతో మంది చిన్నారులు , పెద్దలు చనిపోయారు. మరిన్ని దాడులు జరుగుతాయి కాబట్టి ప్రజలను జాగ్రత్త గా ఉండాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం సూచించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇజ్రాయిల్ లెబనాన్ పరస్పర దాడులు దారుణంగా మారాయి. రెండు దేశాల సరిహద్దులు శవాల గుట్టలుగా మారాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటు సురక్షిత ప్రాంతాలకు తరిలివెళ్లిపోతున్నారు. ఇజ్రాయిల్ దాడిలో బీరూట్ లో ఓ అపార్ట్ మెంట్ ధ్వంసం అయ్యింది ఎంతో మంది చిన్నారులు , పెద్దలు చనిపోయారు. మరిన్ని దాడులు జరుగుతాయి కాబట్టి ప్రజలను జాగ్రత్త గా ఉండాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం సూచించింది.
లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి 240 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు కొనసాగుతున్నట్లు టెలిగ్రామ్ లో వివరించింది. తాము కూడా లెబనాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పట్లో వెళ్లినవాళ్లు ...ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కిరావద్దని తెలిపింది ఇజ్రాయిల్ ప్రభుత్వం.
లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను పంపేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే రిజర్వు బలగాలను సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతిచెందగా, అందులో ఆయన కుమార్తె కూడా మృతి చెందినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు నస్రల్లా అల్లుడు మృతి చెందింది. సిరియా డమాస్కస్ లోని మజ్జే జిల్లా లో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడుజరిపింది.
తాజాగా నస్రల్లా అల్లుడు మృతి చెందినట్లు సమాచారం. సిరియా డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్‌వాసులు మృతి చెందారు. వారితో పాటు హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్- ఖాసిర్ సైతం మరణించినట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. హెజ్‌బొల్లాకు చెందిన ఓ మీడియా సైతం దీన్ని ధ్రువీకరించింది.
లెబనాన్ తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చిచెప్పింది. ఖతార్‌తో ద్వైపాక్షిక చర్చలతోపాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు. వారంపాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని, అమెరికా, ఐరోపా దేశాలు కోరాయన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.