Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం..! 2024-06-23 15:01:42

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొచ్చేస్తుంది. ఏ క్షణమైనా భూమిని ఢీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (nasa ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గ్రహశకలం ఎంత పరిమాణం ఉండేది తెలీదు. భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని చెప్పారు. 


ఈ గ్రహశకలం 2038 జులై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వివరించారు. ఈ ముప్పును తప్పించడానికి నాసా దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు గత ఏప్రిల్( april)  లో బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సెర్ సైజ్ నిర్వహించారు. 


సమీప భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పులేకున్నా.. గ్రహశకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సెర్ సైజ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ గ్రహశకలం...వల్ల భూమికి ఇప్పటికి ఏం ప్రాబ్లమ్ లేదని ఫ్యూఛర్ లో వచ్చే ఇబ్బందికి ...నాసా ఏదైనా ఉపాయం ఆలోచిస్తుందని తెలిపారు.