beaches : మన దేశంలో 'సూపర్ క్లీన్ బీచ్ లు ఇవే ..!

గుజరాత్ నుంచి ఇటు కన్యాకుమారి , పశ్చిమ బెంగాల్ వరకు చాలా రాష్ట్రాలను కలుపుతూ సముద్రతీరం కొనసాగుతుంది


Published Aug 06, 2024 07:27:00 AM
postImages/2024-08-06/1722909761_clean.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మన ఇండియాకు చాలా సుదీర్ఘమైన సముద్రతీరం ఉంది. అటు గుజరాత్ నుంచి ఇటు కన్యాకుమారి , పశ్చిమ బెంగాల్ వరకు చాలా రాష్ట్రాలను కలుపుతూ సముద్రతీరం కొనసాగుతుంది. ఎన్నో వందల బీచ్లున్నాయి. కాని క్లీన్ గా ...ఉండే బీచ్ లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. 


గుజరాత్ లోని ద్వారకలో ఈ బీచ్ ఉంది. ఇక్కడ సముద్రపు నీరు క్లియర్ గా ఉంటుంది. ఇది అత్యంత పరిశుభ్రంగా ఉండటంతో.. ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్ గా గుర్తింపు కూడా పొందింది. శివరాజ్ పురా బీచ్ ద్వారక వెళ్లిన ప్రతి వారు ఈ బీచ్ ను చూస్తారు. క్లియర్ వాటర్ ..నీట్ సాండ్ తో అధ్భుతంగా ఉంటుంది.


పరిశుభ్రతకు, ప్రకృతి అందాలకు కర్ణాటకలోని పదుబిద్రి బీచ్ పెట్టింది పేరు. నీళ్లు కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. సన్నని, బంగారు రంగు ఇసుక ఇక్కడి ప్రత్యేకత. ఫ్యామిలీ ట్రిప్స్ కు ఇది పర్ఫెక్ట్. 


కేరళలోని కప్పాడ బీచ్ కూడా సన్నని, బంగారు రంగు ఇసుక, క్లియర్ వాటర్ ప్రత్యేకతలు. బ్రిటన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టిన వాస్కోడగామా మొదట కాలు పెట్టింది ఇక్కడే. కేరళలోనే చాలా ఫేమస్ బీచ్. వ్యూ అధ్బుతంగా ఉంటుంది.


పూర్తి పరిశుభ్రతకు పెట్టింది పేరు  కోవలం బీచ్. ఇది కూడా కేరళలోనే .  ప్లస్ ఆకారంలోని ఈ బీచ్.. క్లియర్ వాటర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.


పుదుచ్చేరిలోని చిన్నవీరంపట్టినంలో ఉన్న ఈడెన్ బీచ్ కూడా ప్రశాంత వాతావరణానికి, శుభ్రతకు పెట్టింది పేరు. బీచ్ నిర్వహణ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ తో వెళ్తే భలే ఎంజాయ్ చెయ్యొచ్చు. 


అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్ ప్రకృతి రమణీయతకు, శుభ్రతకు ఫేమస్. ఇక్కడి సన్నని, తెల్లని ఇసుక, చాలా క్లియర్ గా ఉండే నీళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.. హనీమూన్ కు పర్ఫెక్ట్ ప్లేస్ . మీకు కాని వాటర్ అంటే మహాఇష్టం అనుకుంటే అండమాన్ కు వెళ్లండి.


ఒడిశాలోని పూరీలో ఉన్న గోల్డెన్ బీచ్ కూడా ప్రకృతి అందాలకు పేరు పొందింది. స్థానిక ప్రభుత్వాల చొరవతో పరిశుభ్రంగా ఉంటుంది. బంగారు రంగు ఇసుక, క్లీన్ వాటర్ కూడా బాగుంటాయి. వ్యూ ని ఎంజాయ్ చేస్తారు.
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కూడా క్లియర్ వాటర్ తో శుభ్రంగా ఉంటుంది. ఇక్కడికి స్థానికులు, పర్యాటకులు తరచూ వస్తుంటారు. విశాఖ వాసులు దాదాపు వారాంతాలు ఇక్కడే పీస్ ఫుల్ ప్లేస్ .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india clean sea

Related Articles