Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ విష్ణుప్రియ !

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణంగా చాలా మంది యాక్టర్లకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. 


Published Mar 20, 2025 12:37:00 PM
postImages/2025-03-20/1742455235_916f972cbcd7f03290d912162ae82dbb.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వకేట్ తో కలిసి ఉదయం పది గంటల టైంలో స్టేషన్ కు వెళ్లారు.  బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు గాను విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు. షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గౌర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ రోజు ఉదయం విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణంగా చాలా మంది యాక్టర్లకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. 


 ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. రీసెంట్ గా 11 మంది ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసి జైలు కు కూడా పంపించారు. విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్లు విష్ణుప్రియ , యాంకర్ శ్యామలతో పాటు హర్షా సాయి, సన్నీ యాదవ్ లాంటి వాళ్లు ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu police vishnu-priya

Related Articles