US Student Visa: అమెరికా స్టూడెంట్ వీసాలు కొన్ని రోజులు లేనట్టే !

విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది.


Published May 28, 2025 11:36:00 AM
postImages/2025-05-28/1748412566_cr20250528tn683691155e586.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా మరో కీలకనిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్త గా దరఖాస్తు చేసుకునే విద్యార్ధు వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకు దౌత్యకేబుల్ ద్వారా ఉత్తర్వలు జారీ చేశారు.


విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్ధుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై అమెరికా ఫోకస్ చెయ్యడంతో రకరకాల దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు చాలా మంది యూఎస్ లో వాళ్ల ఫ్యూఛర్ పై టెన్షన్ పడుతున్నారు.


విద్యార్ధుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను ప్రస్తుతానికి నిలిపివేసే ఉత్తర్యులు తక్షణం అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వులో పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల పరిశీీలనకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మళ్లీ అమెరికా ఆదేశాలిచ్చే వరకు స్టూడెంట్ వీసాలు ఇచ్చే అవకాశం లేదు కాని ఇప్పటికే బుక్ చేసుకున్న  వారు ఇంటర్య్వూలు జరుగుతాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students america

Related Articles