YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడుపై పోలీసు కేసు...దీనిపై అన్వేష్ రియాక్షన్ !

తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ లు దాన కిషోర్, వికాస్ రాజ్ లపై అన్వేష్ ఆరోపణలు చేశారు


Published May 05, 2025 11:51:00 AM
postImages/2025-05-05/1746426182_YoutuberAnveshcontroversy.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.  గత కొన్ని రోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లోను ప్రభుత్వం అనుమతిలేని బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేస్తున్న వారిపై అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వెర్షన్ లో పోరాడుతున్నారు.


తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ లు దాన కిషోర్, వికాస్ రాజ్ లపై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వారి పేర్లను ప్రస్తావిస్తూ అన్వేష్ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అన్వేష్ తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్వేష్ పై హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాధు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా తీసుకొని చాలా సెక్షన్ పై కేసు నమోదు చేశారు.


దీని పై పెట్టిన కేసుపై అన్వేష్ రియాక్ట్ అయ్యారు. తాను రెండు నెలలుగా బెట్టింగ్ యాప్ ల నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అవగాహన కల్పిస్తున్నానని, తనపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నో యేళ్లుగా మెట్రోరైలులో బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాపై కేసు నమోదు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబాలకు 2లక్షల ఆర్థిక సాయం చేస్తున్నానని ఇప్పటి వరకు ఐదు కుటుంబాలకు అందించానని అన్వేష్ తెలిపారు. ఎన్ని కేసులు నమోదు చేసినా తను బెట్టింగ్ యాప్స్ పై ఈ పోరాటం ఆపేది లేదని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : crime na-anveshana youtuber cyber-security loan-apps

Related Articles