బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నబుగ్గారం ఇండియాలోనే చాలా ఆదర్శవంతమైన గ్రామం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వామ్మో ..అదో డ్రీమ్. అంత ఈజీ పని కాదు. ఒక్కరు ఉద్యోగం కొట్టడమే గగనం అంటే...ఊరంతా ప్రభుత్వద్యోగాలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి వండరే. అదో చిన్న పల్లెటూరు. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నబుగ్గారం ఇండియాలోనే చాలా ఆదర్శవంతమైన గ్రామం.
మూడు దశాబ్దాల కిందట వ్యవసాయం తప్పితే మరో ధ్యాసే లేని సాధారణ గ్రామం. ప్రస్తుతం జనాభా 580 వరకు ఉంటే 409 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఓ అంగన్వాడీ కేంద్రం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉంది. పాతికేళ్ల కిందట బడికి వెళ్లాలంటే పక్క గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరాల్సిందే. అది చిన్నబుగ్గారం గతం.కాని ఇప్పుడు ఇక్కడ యువత చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారే. రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు చిన్నబుగ్గారం వేదికగా నిలుస్తోంది.
మేఘాలయ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసే ఇందల్‌కుమార్ హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేసే భూగర్భ నిపుణులు డాక్టర్ లోహిత్‌కుమార్ ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జైసింగ్ బుగ్గారం గ్రామస్థులే. రీసెంట్ గా ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నిఖిత ఈ గ్రామానికి చెందిన అమ్మాయే
అలా అని ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ...వ్యవసాయంలోను వారి గ్రామం అందరికి ఆదర్మమే. వ్యవసాయం చేస్తున్న ఎంఏ. బీఈడీ చేసిన పట్టభద్రులు. ప్రస్తుతం ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నవారు ఐదుగురు, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు ముగ్గురు గ్రామానికి చెందిన వారు ఉన్నారు. అంత చిన్న గ్రామంలో ఇంతమంది ఆదర్శవంతులుగా మారడం మెచ్చుకోదగిన విషయం.