రచయిత, సినిమాటోగ్రాఫర్ భరత్ భూషణ్, నిర్మాత ఠాగూర్ మధు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఉండగా వీరిలో 46 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
కాగా, రచయిత, సినిమాటోగ్రాఫర్ భరత్ భూషణ్, నిర్మాత ఠాగూర్ మధు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో భరత్ భూషణ్ గెలుపొందినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.