ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.6,250 పెరిగి రూ.96,450కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగారం ధరలు భారీ గా పెరుగుతున్నాయి. దేశంలో గోల్డ్ రేటు రికార్డు స్థాయి లో పెరుగుతుంది. ఈ రోజు గ్రాము బంగారం 9600 నడుస్తుంది. అయితే ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర 96 వేలు దాటేసింది. ఆంధ్రా లో అయితే ఇప్పటికే బంగారం లక్ష ధర దాటింది.మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా అమెరికా , చైనా కొట్టుకుచస్తున్నాయి. టారిఫ్ ల పేరుతో చైనా , అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.6,250 పెరిగి రూ.96,450కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో వెండి రేటు రూ.1,08,000కు చేరింది.మరోవైపు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. యూఎస్ ప్రభుత్వం గురువారం చైనాపై టారిఫ్ ను 145శాతానికి పెంచింది. రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది. బంగారం మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు.