న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బీటెక్ / బీఈ పూర్తి చేసిన వారికి ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ల్లోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు, ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా ఈ పరీక్షలు రాయొచ్చు. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ తో నియమాకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ టైంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. మొదటినెల నుంచే రూ. లక్షకు పైగా జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుం లేదు : టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) నోటిఫికేషన్ను దాదాపు ప్రతి సంవత్సరం ఆర్మీ విడుదల చేస్తోంది. వీటికి అవివాహిత పురుషులు అర్హులు. అయితే మీకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రుసుం లేదు. వచ్చిన దరఖాస్తులను బీటెక్ మార్క్స్ మెరిట్ ప్రకారం నెక్స్ట్ రౌండ్ కు ఎంపిక చేస్తారు. తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ), బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వీటిని సైకాలజిస్ట్ , గ్రూప్ టెస్టింగ్ , ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేపడతారు.మొదటిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటలిజెన్స్) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారినే స్టేజ్-2కు ఎంపిక చేస్తారు. అయితే ఈ పరీక్షలన్నీ నాలుగు రోజుల పాటు నాలు విభాగాల్లో పరీక్షించి అందులో రాణించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ కు తీసుకుంటారు ఇంటర్వ్యూకు హాజరైన వారికి ప్రయాణ ఖర్చులూ చెల్లిస్తారు.ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్-10 రూ.56,100 బేసిక్ పేతో పాటు రూ.15,500 మిలటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. అందువల్ల మొదటి నెల నుంచే సుమారు రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
అయితే కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్/ ఐటీ విద్యార్హతల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ఖాళీలకూ అవివాహిత పురుషులే అర్హులు. ఈ అర్హతలున్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు.
అయితే జనవరి 1,2026 నాటికి 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. జనవరి 2,1999 జనవరి 1, 2006 మధ్య పుట్టిన వారు ఈ పరీక్షకు అర్హులు. అయితే మే 29 మధ్యాహ్నం 3 గంటల వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తారు.