వ్యాపార దాతృత్వం కలిగిన మహానుభావుడు రతన్ టాటా . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రతన్ టాటా కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది మహారాష్ట్ర క్యాబినేట్ . వ్యాపార నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రి వర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. రతన్ టాటా సేవలు భారత్ మరిచిపోకూడదు. వ్యాపార దాతృత్వం కలిగిన మహానుభావుడు రతన్ టాటా . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు.
టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇఫ్పుడు అంత్యక్రియలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటాకు సంబంధించి ఒక రోజు సంతాప దినం ప్రకటించింది . 2008 ముంబై దాడి తర్వాత రతన్ టాటా చూపిన దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీఎం షిండే ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు .
రతన్ టాటా నిర్ణయాలు, బలమైన ఆలోచనలు, దూరదృష్టి , ధైర్యవంతమైన వైఖరి సామాజిక నిబధ్ధత ఎప్పటికి గుర్తుంటాయి. వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, ప్రముఖులంతా ముంబైకి క్యూ కట్టారు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు. రతన్ టాటాకు కడసారి నివాళి అర్పించేందుకు తరలివస్తున్నారు . ఆనంద్ మహింద్ర, శరద్‌పవార్ రతన్ టాటాకు నివాళి ,అర్పించారు.