22 క్యారెట్లు తులం గోల్డ్ రూ.800 పైగా పెరగింది72 ,410 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా మార్కెట్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం , వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఓ రోజు పెరిగితే మరో రోజు తగ్గుతాయి. కాని 24 క్యారట్ల స్వఛ్ఛమైన బంగారం పై ఏకంగా రూ. 870 పెరిగింది. ఇప్పుడు 24 క్యారట్లు ధర 78990 కు చేరుకుంది. అంతేకాదు 22 క్యారెట్లు తులం గోల్డ్ రూ.800 పైగా పెరగింది72 ,410 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా మార్కెట్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇజ్రాయిల్ యుధ్దాలు జరుగుతున్నాయి. దీని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. బంగారం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. బంగారమే కాదు ...వెండి పై కూడా రేట్లు దారుణంగా పెరిగింది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,560గా ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 79,140కి ఎగబాకింది.
*ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది. కలకత్తా , బెంగుళూరులో మార్కట్ రేటు ఒకేలా ఉంది.
* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,9920 వద్ద కొనసాగుతోంది.
శనివారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 99,100కి చేరింది. విశాఖలో కిలో వెండి ధర రూ. 1,05,100గా ఉంది. అయితే మరింత పెరిగే ఛాన్స్ ఉంది.