miss universe : మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ !

మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్‌ పలాసియోస్‌ చేతుల మీదుగా విక్టోరియా తన కిరీటాన్ని అందుకుంది. 


Published Nov 17, 2024 12:20:00 PM
postImages/2024-11-17/1731826276_gettyimages2185181478.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మిస్ యూనివర్స్ కిరీటాన్ని డెన్మార్క్ బ్యూటీ దక్కించుకుంది. ఆమె బ్యూటీకి వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో  కిరీటాన్ని డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కేజర్ కైవసం చేసుకున్నారు. 21 ఏళ్ళ వయసులో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్‌ పలాసియోస్‌ చేతుల మీదుగా విక్టోరియా తన కిరీటాన్ని అందుకుంది. 


మెక్సికోకి చెందిన మరియా ఫెర్నాండ, నైజీరియాకి చెందిన చిడిమ్మ ఆడెట్శిన, థాయిలాండ్ కి చెందిన సచతా చుంగ్శ్రీ , వెనుజులకి చెందిన ఇలియానా మార్కిజ్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు.  ఈ ఐదుగురు విజేతను డిసైడ్ చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో పాల్గొన్నారు.గ్రాండ్ ఫినాలేలో విక్టోరియా బ్రైట్ పింక్ కలర్ లాంగ్ గౌన్ ధరించి అందంగా మెరిసింది. విక్టోరియా అందాలు చూసిన వారంతా ...మిస్ యూనివర్స్ కి పర్ఫెక్ట్ అంటున్నారు నెటిజన్లు.


ఇక ఇండియాకి చెందిన అహ్మదాబాద్ మోడల్ రిహా సింగా కూడా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొన్నారు.  అయితే ఈ బ్యూటీ  టాప్ 30 వరకు చేరుకోగలిగింది. కానీ తర్వాతి రౌండ్ లో టాప్ 12 కి చేరుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాది మిస్ యూనివర్స్ భారత్ కు చేజారిపోయినట్లే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu denmark beauty

Related Articles