ట్రైన్ టికెట్ కొనడం వల్ల మనకు ఉచితం గా కొన్ని సదుపాయాలు వస్తాయి. కాని మనకు తెలీదు. ఉచితంగా ఆహారం, పడక గది ఇలా సదుపాయాలు పొందొచ్చు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ట్రైన్ టికెట్ కొనడం వల్ల మనకు ఉచితం గా కొన్ని సదుపాయాలు వస్తాయి. కాని మనకు తెలీదు. ఉచితంగా ఆహారం, పడక గది ఇలా సదుపాయాలు పొందొచ్చు. అదెలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఫ్రీ ఫుడ్ .... మీరు రాజధాని, దుంతో, శతాబ్ధి వంటి ప్రీమియం ట్రైన్ లోనే ప్రయాణించాలి. అక్కడ కూడా ఒక కండిషన్ అప్లై అవుతుంది. కనీసం రెండు గంటలు రైలు ఆలస్యం అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ఉచితంగా భోజనం అందుతుంది. మీరు ఏదైనా మంచి ఆహారం తినాలి అనుకుంటే.. ఈ కేటరింగ్ సేవ ద్వారా ఫ్రీగగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
* ఉచిత బెడ్ షీట్…ఏసీ1, ఏసీ2, ఏసీ3 కోచ్ లలో తన ప్రయాణీకులకు ఒక దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ ను ఇస్తారు. అయితే చాలా మందికి టవల్ ఇస్తారని తెలీదు. కాని టవల్ కూడా ఇస్తారు.
* ఉచిత వైద్య సహాయం…రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా కూడా ఉచితంగా వైద్య సహాయం కూడా అందిస్తారు. మీకు జస్ట్ ఫీవర్ వచ్చినా ..టీటీ ని అడిగితే మెడిసిన్ అందుబాటులో ఉంటాయి.
* మీ ట్రైన్ ..కాని లేటు అయితే ..మీరు ఫ్రీగా వెయిటింగ్ హాల్ లో వెయిట్ చెయ్యొచ్చు.
5.ఫ్రీగా లగేజ్ ఉంచడానికి…లాకర్ రూమ్, క్లోక్ రూమ్ అని పిలువబడే ఈ గదులలో మీరు మీ వస్తువులను గరిష్టంగా 1 నెల వరకు ఉంచవచ్చు. కాని డబ్బులు కట్టాలి.మీ టికెట్ట్ మీద రాయితీ లభిస్తుంది.