బడ్జెట్ లో అయిపోతుంది. అయితే రైల్వే ఎక్కడో ఒక దగ్గర ఎండ్ పాయింట్ ఉంటుంది గా....ఆ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏంటో తెలుసుకుందాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రయాణీకుల సౌలభ్యం కోసం, దేశంలోని ప్రతి ముఖ్య ప్రదేశంలో రైల్వే స్టేషన్లు నిర్మించబడ్డాయి. వేల రైళ్లు లక్షల ప్రయాణాలు...ప్రతి గమ్యానికి ఓ ప్రత్యేక కారణం. అయితే రైలు ద్వారా దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్లొచ్చు. ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమైన మార్గం రైలే. బడ్జెట్ లో అయిపోతుంది. అయితే రైల్వే ఎక్కడో ఒక దగ్గర ఎండ్ పాయింట్ ఉంటుంది గా....ఆ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏంటో తెలుసుకుందాం.
. అక్కడి నుంచి సులభంగా విదేశాలకు కూడా వెళ్లవచ్చు. అవును, నేపాల్‌కు చాలా దగ్గరగా బీహార్‌లో ఒక రైల్వే స్టేషన్ ఉంది. అంటే ఇక్కడి నుంచి దిగి నడిచే నేపాల్‌కు ప్రయాణించవచ్చు.బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ జోగ్‌బానీ అని పిలుస్తారు. ఇదే భారతదేశ చిట్టచివరి రైల్వేస్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి నేపాల్‌కు నడిచే వెళ్లవచ్చు. మంచి విషయం ఏమిటంటే, భారతీయులకు నేపాల్ వెళ్లడానికి వీసా, పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు. కాబట్టి దర్జాగా అరారియా నుంచి నేపాల్ అందాలు చూస్తూ దేశం దాటేయొచ్చు.
బెంగాల్‌లోని సింగబాద్ రైల్వే స్టేషన్ కూడా దేశంలోని చివరి స్టేషన్‌గా పరిగణించబడుతుంది. మాల్డా జిల్లాలోని హబీబ్ పూర్ లో కట్టిన సింగబాద్ స్టేషన్ కూడా బోర్డర్ లో చిట్టచివరి స్టేషన్. ఒకప్పుడు ఈ స్టేషన్ కలకత్తా , ఢాకా మధ్య లింక్ ఉండేది. ఇఫ్పుడు లేదు.ఈ రైల్వే స్టేషన్ ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ స్టేషన్ ఇప్పటికి బ్రిటిష్ కాలం నాటిదే. కార్డు టికెట్లు...పాత కాలం టెలిఫోన్ ...అక్కడ సిగ్నల్స్ అన్ని వింటేజ్ లుక్ లో ఉంటాయి. మీకు కాని వింటేజ్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే మాత్రం సింగాబాద్ వెళ్లొచ్చు. కాని ట్రైన్లు వెళ్లవు..రావు ...అది చూసుకొని వెళ్లండి.