Tandoori Chicken: మన తందూరి చికెన్ వరల్డ్ బెస్ట్ గ్రిల్ చికెన్ లో ఒకటంట!

చాలా మందికి ఇది ఫేవరెట్ డిష్‍గా ఉంది. ఇప్పుడు, ఇండియన్ పాపులర్ ‘తందూరి చికెన్‍’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది.


Published Nov 16, 2024 05:55:00 PM
postImages/2024-11-16/1731759974_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచ బెస్ట్ గ్రిల్డ్ చికెన్ వంటకాల్లో తందూరి చికెన్ కు ప్లేస్  దక్కింది. అసలు మాకు ఎప్పుడో తెలుసండి. ఆ రుచి లేకపోతే ఇండియాలో ఎక్కడ చూసినా మన చికెన్ రెసిపీలకు ఫిధా అయినవాళ్లే. అయినా మన భారతీయ మసాలాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. చాలా మందికి ఇది ఫేవరెట్ డిష్‍గా ఉంది. ఇప్పుడు, ఇండియన్ పాపులర్ ‘తందూరి చికెన్‍’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది.


అయితే మన భారతీయ తందూరి చికెన్ కు  19వ స్థానంలో చోటు దక్కించుకుంది. దీంతో దీనికి ఎంత పాపులారిటీ ఉందో మరోసారి స్పష్టమైంది. అయితే సరైన పధ్ధతిలో గ్రిల్ చేస్తే చాలా హెల్దీ అని తెలిపారు. గ్రిల్ చికెన్ లో చాలా మంచి టేస్ట్ ఉంటుందని తిన్న వాళ్లు తెగ పొగిడేశారట. తందూరి చికెన్‍కు ఘనమైన పురాతన చరిత్ర ఉంది. ఈ వంటకానికి పర్షియన్ మూలాలు ఉన్నాయి. పర్షియాకు చెందిన కొందరు ప్రపంచ యాత్రికులు.. భూమిలో గుంటలు తవ్వి మట్టి కండల్లో మాంసాన్ని కాల్చుకునే వారు. దీన్ని తందూరి చికెన్‍కు మూలంగా భావిస్తారు. అయితే ఆ రెసిపీ ని ఇలా మన వాళ్లు మన భారతీయ మసాలాలు...కారం ..లాంటి వాటిని వాడి మరింత స్పైసీ టేస్టీగా తయారుచేశారని ప్రతీతి.


అయితే మరో వాదన కూడా ఉంది. హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 3000ల కాలంలోనే తందూరి చికెన్‍ను మూలాలు ఉన్నాయని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. అప్పుడు మట్టి కుండల్లో మాంసం వండుకోవడాన్ని తందూర్ అని పిలిచేవారట. మొత్తంగా తందూరి చికెన్ మూలాలకు రెండు వాదనలు ఉన్నాయి.  అక్కడ నుంచి కుందన్ లాల్ గుజ్రాల్, కుందన్ లాల్ జగ్గి అనే పంజాబీ సోదరులు ఈ వంటకాన్ని విస్తృతంగా తయారు చేశారు.  అప్పటి నుంచి భారత్ లో తందూరి చికెన్ చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ప్రాంతానికి తగ్గట్లు ఆయా ప్రాంత ప్లేవర్లతో అన్ని రాష్ట్రాల్లో బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu chicken india healthy-food-habits tasty-food-

Related Articles