ఒక వీడియో రూపంలో భవిష్యవాణి చెప్పగా దానికి ఇప్పటికే 26 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏ తేదీకి ఏ విపత్తు జరుగుతుందో కూడా చెప్పాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అసలు ఇలాంటి అరిష్టాలు, సునామీలు వింటూ ఉంటే 2012 సునామి వస్తుందన్న సినిమా గుర్తొస్తుంది. వచ్చింది లేదు...చచ్చింది లేదు కాని ...అప్పుడు జనాలంతా హడలిపోయారు. నిజమో అబధ్ధమో మళ్లీ ఇప్పుడు అలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా అని ఇదంతా అబధ్ధం అని కొట్టి పారేయలేం. ఎందుకంటే వంగా, నోస్ట్రాడామస్ వంటి వారు భవిష్యవాణి చెబుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. వారు చెప్పేది నిజమో, ఊహాజనితమో కానీ వారిద్దరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించారు.
ఇప్పుడు తనను తాను టైమ్ ట్రావెలర్‌గా చెప్పుకుంటూ ఎల్విస్ థాంప్సన్ అనే ఓ వ్యక్తి చెప్పిన జోస్యం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఇన్ స్టా లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతడు ఒక వీడియో రూపంలో భవిష్యవాణి చెప్పగా దానికి ఇప్పటికే 26 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏ తేదీకి ఏ విపత్తు జరుగుతుందో కూడా చెప్పాడు.
ఏప్రిల్ 6: అమెరికాలోని ఒక్లహోమాలో 24 కిలోమీటర్ల వెడల్పయిన టోర్నడో గంటకు 1,046 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ విధ్వంసం సృష్టిస్తుంది. ఇది భారీ ప్రాణ నష్టం కలిగిస్తుందని తెలిపాడు.
మే 27: అమెరికాలో రెండో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది టెక్సాస్ విడిపోవడానికి, అణు ఘర్షణలకు దారితీస్తుంది. అమెరికాను శిథిలావస్థకు తెస్తుంది. ఇక అమెరికా తేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని చెప్పాడు.
సెప్టెంబర్ 1: ఛాంపియన్ అనే ఏలియన్ భూమిపైకి వచ్చి 12,000 మంది మానవులను వారి భద్రత కోసం మరొక గ్రహానికి తీసుకువెళుతుంది. ఈ గ్రహాంతర వాసులు భూమికి చాలా ప్రమాదకరం .
సెప్టెంబర్ 19: అమెరికా తూర్పు తీరాన్ని ఒక శక్తివంతమైన తుపాను ముంచెత్తుతుంది. దీని వల్ల అమెరికా భారీ నష్టాన్ని చూస్తుంది.
నవంబర్ 3: పసిఫిక్ మహాసముద్రంలో సెరీన్ క్రౌన్ అనే నీలి తిమింగలం కంటే ఆరు రెట్ల పరిమాణం ఎక్కువగా ఉండే సముద్ర జీవిని గుర్తిస్తారు.
అయితే థాంప్సన్ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. నువ్వు చెప్పిన డేట్స్ అని నోట్ చేసుకుంటాం. ఏం జరగకపోతే నీ మీద కేసులు పెడతామంటూ కామెంట్లు పెడుతున్నారు. “టైమ్ ట్రావెల్ చేసి భవిష్యత్తుకు వెళ్లి వచ్చావు సరే. వచ్చే వారం ఏ లాటరీకి ప్రైజ్ వస్తుందో చెప్పు. ఆ లాటరీ కొని పెట్టుకుంటా” అని ఓ యూజర్ సెటైర్ వేశాడు. అసలు నీ మాటలు కూడా నమ్ముతున్నారు చూడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నిజమేనేమో ఎందుకు ఇలా కామెంట్లు పెడుతున్నారంటూ మరికొందరు రియాక్ట్ అయ్యారు.