ఆహారం కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఫీడింగ్ వ్యాన్‌ను కూడా పంపించాడు. అయోధ్య వానర సేనకు అక్షయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అయోధ్య రామయ్య వానర సేనపై అక్షయ్ కుమార్ తన పెద్ద మనసు చాటారు. . దీపావళి కానుకగా అయోధ్యలోని వానరసేనకు రూ.1 కోటి విరాళం ప్రకటించాడు. అయోధ్య రామాలయానికి వచ్చే భక్తులను వానరసేన ఇబ్బంది పెట్టకుండా... అలాగే ఆకలితో ఉన్న వానరసేనకు ఆహారం కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఫీడింగ్ వ్యాన్‌ను కూడా పంపించాడు.
అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ ఆహారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. బాలరాముడి ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచి అయోధ్యశివారులోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1,200 కోతులకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నాడు. అంతే కాదు వానరునికి పౌష్టికాహారం అందించడం కోసం దాదాపు 100 వ్యాన్లలో అయోధ్య సివార్లలో పౌష్టికాహారం అందిస్తున్నారు.
అక్షయ్ కుమార్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీపావళి సందర్భంగా తన తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ వారి పేరిట వానరసేనకు ఆహారం అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. దీనిని చూసి తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సంతోషిస్తారన్నాడు. నిజానికి దీపావళి నార్త్ లో పెద్దపండుగ. పెద్దలపండుగ కూడా ...చనిపోయినవారిని తలుచుకుంటూ చాలా దానధర్మాలు చేస్తుంటారు.