HBD Amitabh Bachchan: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ ...సార్ !

బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ఎన్నో సినిమాలు ...మరెన్నో ఇండస్ట్రీ ఎంట్రీలతో ఫుల్ గా ఫేమ్ సాధించారు.


Published Oct 11, 2024 08:21:00 PM
postImages/2024-10-11/1728658413_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమితాబ్ తెలియని ఇండస్ట్రీ నే లేదు. పేరుకే బాలీవుడ్ యాక్టర్ ..ఎప్పుడు పాన్ ఇండియా లెవల్ క్రేజ్ తో ఫుల్ స్పీడ్ లో ఉంటారు. అసలు బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ఎన్నో సినిమాలు ...మరెన్నో ఇండస్ట్రీ ఎంట్రీలతో ఫుల్ గా ఫేమ్ సాధించారు.  ఈరోజు బిగ్ బీ తన 81వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆయన జీవితంలో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం.


1942లో అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌లో జన్మించిన అమితాబ్ బచ్చన్. చాలా సాధారణ జీవితం .. ఎన్నో కష్టాల తర్వాత బాలీవుడ్ స్టార్ అయ్యాడు. అసలు బాలీవుడ్ లో అమితాబ్ ప్రయాణం ఎలా మొదలయ్యిందంటే ...1969లో ‘సాత్ హిందుస్థానీ’తో మొదలైన ఆయన నట ప్రస్థానం ‘గణపథ్’ వరకు కొనసాగుతూనే ఉంది. 


మృణాల్‌సేన్ ‘భువన్‌షోమ్’ మూవీలో వాయిస్ నేరేటర్‌గా సినీ ప్రస్థానం జరిగింది. వెండితెర యాంగ్రీ యంగ్ మెన్ గా దేశమంతా చాలా పేరు గడించారు. బాలీవుడ షెహెన్ షా ...పద్మవిభూషణ్...దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబచ్చన్ . తెలుగులోను రీసెంట్ కల్కి ...చిరు తో సైరా నరసింహా రెడ్డి తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళ్ వెట్టయాన్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 


భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గ్రంథాన్నే రాసుకున్నఅమితాబ్... తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన సిక్కు మహిళ. అమితాబ్‌కు మొదట వారి తల్లిదండ్రులు ‘ఇంక్విలాబ్’ అనే పేరు పెట్టారు. సినిమాల్లోకి వచ్చాక అమితాబ్ కు అమితాబచ్చన్ పేరు వచ్చింది.  జయాబచ్చన్ ను పెళ్లి చేసుకున్నాడు...అభిషేక్ లాంటి నటుడ్ని తయారుచేశాడు. ప్రపంచ సుందరిని కోడల్ని చేసుకున్నాడు. కుటుంబాన్ని అంచలంచలుగా పెంచుకున్నాడు. సక్సస్ కు రియల్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు. 

newsline-whatsapp-channel
Tags : amithab-bachchan newslinetelugu birthday bollywood

Related Articles