అల్లర్ల కారణంగా భారత్ లో తలదాచుకున్న షేక్ హసీనా ను తమకు అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్ధించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగ్లాదేశ్ లో రీసెంట్ గా జరిగిన గొడవలు అందరికి తెలిసిందే . అక్కడి హిందూ సమాజంపై అల్లరిమూకలు దాడి తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అల్లర్ల కారణంగా భారత్ లో తలదాచుకున్న షేక్ హసీనా ను తమకు అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్ధించింది.
రీసెంట్ గా ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధిపై కూడా భారీ దాడి జరిగింది.అయితే ఇలాంటి టైంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహో ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు రూ.200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందనే విషయాన్ని తెలిపారు. అయితే దీని వల్ల బంగ్లాదేశ్ కు కరెంట్ ను ఆపేయాలనే ఆలోచన ఇంత వరకు లేదని ...అలాంటి ఆలోచన చెయ్యాలంటే పెద్ద ఎత్తున అధికారులతో మాట్లాడాలని అన్నారు.
బంగ్లాదేశ్‌కు 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది.దీనికి తోడు ఈ బకాయిలకు ప్రతి రోజు మరింత మొత్తం చేరుతుంది . రీసెంట్ గా మాణిక్ సాహో మాట్లాడుతూ త్వరలోనే బంగ్లాదేశ్ ఈ మొత్తాన్ని చెల్లిస్తుందని తెలిపారు. విద్యుత్తు సరఫరా కొనసాగించాలంటే మాత్రం తప్పక అప్పు తీర్చక తప్పదని తెలిపారు.