భారత్ లోనే కాదు..యావత్ ప్రపంచం అంతా యూట్యూబ్ , ఇన్ స్టా, రీల్స్ చుట్టు తిరుగుతున్నారు. అయితే కరెక్ట్ గా ప్లాన్ చెయ్యాలి కాని ..లైకులే లైకులు. ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ వంటి వాటిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చిత్ర విచిత్రాలన్నీ చేస్తున్నారు. ప్రాంక్ వీడియోస్ అయితే ..అసలు ఏది నిజం ...ఏది అబధ్దం తెలీకుండా పోతుంది.ఇవన్నీ ...సోషల్ మీడియాలో ఫేమ్ రావడం కోసమే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : భారత్ లోనే కాదు..యావత్ ప్రపంచం అంతా యూట్యూబ్ , ఇన్ స్టా, రీల్స్ చుట్టు తిరుగుతున్నారు. అయితే కరెక్ట్ గా ప్లాన్ చెయ్యాలి కాని ..లైకులే లైకులు. ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ వంటి వాటిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చిత్ర విచిత్రాలన్నీ చేస్తున్నారు. ప్రాంక్ వీడియోస్ అయితే ..అసలు ఏది నిజం ...ఏది అబధ్దం తెలీకుండా పోతుంది.ఇవన్నీ ...సోషల్ మీడియాలో ఫేమ్ రావడం కోసమే.
ఇటీవల కాలంలో ట్రావెల్ బ్లాగింగ్ వీడియోలు చేసే వారికి అధికంగా ఫాలోవర్స్ వస్తున్నారని ట్రావెల్ వీడియోలు చేస్తున్నారు. కాని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ దేశంలో నలుమూలల కవర్ చేసేస్తున్నారు. అయితే ఈ ప్లేసులు కవర్ చేస్తే మాత్రం మీకు పక్కా లైకులు, సబ్ స్క్రైబర్లు పెరుగుతారు.
* కొడైకెనాల్, తమిళనాడు
కొడైకెనాల్ వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. అందమైన జలపాతాల హొయలను మీరు ఎంజాయ్ చేస్తూ జనాలకు కూడా చెప్పవచ్చు. ఆ గ్రీనరీ ..వాటర్ ఫాల్స్ ..ఫుల్ మజా వస్తుంది .
* షిల్లాంగ్, మేఘాలయ
వర్షాకాలంలో షిల్లాంగ్ కూడా వానాకాలం చూడాల్సిన ప్లేస్ . మీరు గౌహతి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ కూడా నేచర్ ను చాలా బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. ఇక్కడ ప్యూర్ వాటర్ ఉన్న నదులు చాలా ఫేమస్. మేఘలయ అందాలు కూడా మీ వ్యూయర్స్ ను పెంచుతాయి.
* లోనావాలా
ముంబై-పూణే మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో ట్రావెల్ బ్లాగర్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.ఇక్కడ కూడా వానాకాలం అంతా భలే అధ్భుతమైన ప్లేసులు చూడొచ్చు. ట్రెక్కింగ్స్ చెయ్యెచ్చు వాటర్ ఫాల్స్ ..నేచర్ తో పిచ్చెక్కిస్తుంది.
* రాణిఖేత్, ఉత్తరాఖండ్
‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ సమీపంలో ఉన్న రాణిఖేత్ వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. ఢిల్లీ నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
* అరుకు
విశాఖపట్నం నుంచి ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. మీరు కిరండూల్ ప్యాసింజర్ రైలు ద్వారా కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.
ఈ ట్రిప్స్ అన్నీ ...దాదాపు 10 వేల రూపాయిలకి అయిపోతాయి. ట్రస్ట్ మీ ...మీకు ఫాలోవర్స్ పెరగకపోతే అడగండి.