టెన్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు గేమ్స్ ఆడుతున్నారు, అయితే శుక్రవారం వరకు జరిగే ఓటింగ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఓ క్లారిటీ వచ్చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ 8 లో కాసేపట్లో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవ్వనున్నారు. అయితే ఈ సారి ఎలిమినేషన్ ఎవ్వరు గెస్ చెయ్యలేరు. ఎవరు ఎలిమినేషన్ అనేది జనాల్లో క్యూరియాసిటీ బాగా పెరిగింది. కంటెస్టెంట్స్ అందరు ఎలిమినేషన్ టెన్షన్ తో ఉన్నారు. టెన్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు గేమ్స్ ఆడుతున్నారు, అయితే శుక్రవారం వరకు జరిగే ఓటింగ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఓ క్లారిటీ వచ్చేసింది.
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ఎవరైతే ఛార్జింగ్‌తో నిలిచి ఉంటారో వాళ్లే మెగా చీఫ్ కంటెండర్లు. ఇందులో రాయల్ క్లాన్ గెలిచింది. ఆ టీమ్‌లో మెగా చీఫ్ అయ్యేందుకు పోటీపడుతున్న వారికి పట్టుకో లేదంటే వదులుకో అనే టాస్క్ ఇచ్చాడు . ఈ గేమ్ లో ఓ ఎముకను సర్కిల్ లో ఉంచుతారు. దాని చుట్టు అంతా తిరగాలి..ఎవరైతే బజర్ మోగినప్పుడు దానిని టచ్ చేస్తారో వాళ్లు ఈ గేమ్‌లో పాల్గొంటున్న ఇద్దరిని తీసేయొచ్చు.. ఈ టాస్క్‌లో గౌతమ్ ఎక్కువసార్లు గెలిచి మెగా చీఫ్ అయ్యాడు. అయితే తన చేతి బ్యాండ్ ను తీసి గౌతమ్ కు అందించారు. అయితే విన్నింగ్ ప్రైజ్ పెంచడానికి పృథ్వీ లాంగ్ హెయిర్ కట్ చేసుకుంటే ..50 వేలు ...గడ్డం తీసుకుంటే మరో లక్ష రూపాయిలు పెంచుతారు. కాని పృథ్వీ దేనికి ఒప్పుకోలేదు. అయితే అవినాష్ మాత్రం తన జుట్టును కత్తిరించుకోవడానికి ఓకే చెప్పాడు.
ఇప్పుడు ఓటింగ్ పరిశీలిస్తే నబిల్ అఫ్రిది ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచాడు నిఖిల్. నబిల్‌కు 17.48 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. నిఖిల్ 19.24 శాతం ఓట్లతో నిలిచాడు.నాగమణికంఠ (12.69 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు, ప్రేరణ (12.1 శాతం), పృథ్వీరాజ్ (9.21 శాతం), యష్మి (8.86 శాతం) , గౌతమ్ (7.34 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. అయితే తాజా ఓటింగ్స్ ప్రకారం హరితేజ (6.62 శాతం), టేస్టీ తేజా (6.47 శాతం) ఓట్లు సంపాదించారు. లీస్ట్ ఓటింగ్ లో టేస్టీ తేజ ఉన్నారు.దీన్ని బట్టి చూస్తే టేస్టీ తేజ... ఎలిమినేట్ అవుతారు.