నిజానికి ఎక్కువ బరువు ఉన్నవారిలో కాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ. వారి లైఫ్ స్టైల్ , ఫుడ్ అలవాట్లు ఇవన్నీ మ్యాటర్స్. కాబట్టి రిస్క్ తగ్గాలంటే బరువు తగ్గాల్సిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే దీర్ఘకాలిక కొవ్వును శరీరంలో ఉంచుకోకూడదు. అంటే అధిక బరువు కలిగి ఉండకూడదు. పొరపాటున మీరు కాని ఫిజికల్ ఫిట్ నెస్ లేకపోతే అన్ని రోగాలు వస్తాయి కాబట్టి శారీరక శ్రమ కంపల్సరీ. నిజానికి ఎక్కువ బరువు ఉన్నవారిలో కాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ. వారి లైఫ్ స్టైల్ , ఫుడ్ అలవాట్లు ఇవన్నీ మ్యాటర్స్. కాబట్టి రిస్క్ తగ్గాలంటే బరువు తగ్గాల్సిందే.
బరువు వల్ల చాలా నష్టాలున్నాయని అందరికి తెలిసిందే. కాని క్యాన్సర్ లాంటి రిస్క్ లున్నాయని మాత్రం ఇప్పుడిప్పుడు చాలా ఎక్కువగా తెలుస్తుంది.ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా వరకు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఉదయం లేదా సాయంత్రం అయినా వ్యాయమం లేదా వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ ముప్పును 50 శాతం వరకు తగ్గించవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాయామం చేయడం కుదరని వాళ్లు యోగా చేసినా మంచిదే. అయితే యోగా కూడా మీ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది. యోగా అనేది శరీరానికి మనస్సుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శరీరం ఆరోగ్యం 90 శాతం ఫుడ్ మీద ఆధారపడితే మరో 10 పర్సంట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యమైనది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో వ్యాధులు రాకుండా ఉండాలంటే కంపల్సరీ శారీరక శ్రమ ఉండాల్సిందే.