చాలా మందికి స్వామి వారికి జరిపే అన్న సమారాధనలో ...తమ వంతు చెల్లించాలనే కోరిక ఉంటుంది.అయితే ఒక రోజు తిరుమలలో వచ్చే వారందకి అన్నదానం చెయ్యించాలంటే ఎంత ఖర్చవుతుందో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి కరుణ కోసం రోజు కోట్లలో జనాలు ఎదురుచూస్తారు. కోరికలు తీర్చమని కొందరు...కోరిక తీరందని మరికొందరు ఇలా జనాలు స్వామి వారి చుట్టు తిరుగుతూనే ఉంటారు. అయితే స్వామి వారికి మొక్కులు తీర్చడంతో పాటు చాలా మందికి స్వామి వారికి జరిపే అన్న సమారాధనలో ...తమ వంతు చెల్లించాలనే కోరిక ఉంటుంది.అయితే ఒక రోజు తిరుమలలో వచ్చే వారందకి అన్నదానం చెయ్యించాలంటే ఎంత ఖర్చవుతుందో చూసేద్దాం.
ఒక రోజంతా పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం రూ. .44 లక్షలు తిరుమల ట్రస్టుకు చెల్లించాలి. ఉదయం అల్పాహారం కోసం మాత్రమే అయితే రూ. 10 లక్షలు, మధ్యాహ్నభోజనం కోసం మాత్రమే అయితే రూ 17 లక్షలు, రాత్రి భోజనం కోసం అయితే రూ. 17 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీకు ఇష్టం ఉంటే మీరే వడ్డించవచ్చు కూడా.
చాలా సేవలు చెయ్యొచ్చు...క్యూ కాంప్లెక్సులతో పాటు ...మెటర్నటి ఆసుపత్రి , బర్డ్ , ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి తిరుచానూరులోని అన్న ప్రసాద భవనంలోను భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తారు. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోను అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రత్యేక ప్రవేశ దర్శన కంప్లెక్స్ , ఇలా చాలా అన్న ప్రసాద విభాగాలున్నాయి. రోజుకు దాదాపుగా 2.5 లక్షల మందికి అన్నదానం చేస్తారు.