COCONUT WATER: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చేసే మేలేంటి ! 2024-06-19 20:30:37

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొబ్బరినీరు ( COCONUT WATER) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎండాకాలం( SUMMER)  వచ్చిందంటే చాలు ఈ శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.


లేత కొబ్బరి నీళ్లలో అనేక సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌, పొటాషియం, సోడియం(SODIUM) అత్యధికంగా ఉండి శరీరంలో వ్యాధినిరోధక శక్తి ( IMMUNITY)పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది. శరీరాన్ని టక్కున నీరసం నుంచి బయటపడేయాలంటే కొబ్బరి నీళ్లకు మించింది ఏదీ లేదు.


 పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగితే పాల ( MOTHER FEED) ద్వారా వారి బిడ్డలకు ఈ పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు అనేక ఇన్‌ ఫెక్షన్ల నుంచి రక్షించబడతారు. గర్భవతి గా ఉన్నపుడు ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రిస్క్ లేని ప్రెగ్నెన్సీ ని మీరు చూడగలరు.
 కొబ్బరి నీరు మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు( URINARY INFECTION) , మూత్రపిండంలో రాళ్లను( KIDNEY STONES)  తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి  నీళ్లు నాలుగు లేదా ఐదు సార్లు ముఖం పై ఓ చిన్న లేయర్ మాస్క్ లాగా వేసుకుంటే ముఖం పై ఉన్న డర్ట్..పోయి స్క్రీన్ క్లీన్ గా ఉంటుంది.