google: గూగుల్ జెమినితో ట్రెండింగ్ ఘిబ్లీ పిక్స్ ఎలా చెయ్యాలి !

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్ జెమినీ ఉపయోగించి తమ పిక్స్ ను ఫ్రీ గా మార్చుకోవచ్చు.


Published Mar 31, 2025 05:23:00 PM
postImages/2025-03-31/1743422037_ghibliai.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రముఖ జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. గూగుల్ జెమినీ ఏఐ హెల్ప్ తో కస్టమర్లకు తన వ్యక్తిగత మూవీలను హయవో మియాజాకి ఆర్ట్ స్టయిల్ కి మార్చుకుంటున్నారు. " స్పిరిటెడ్ అవే " ద బోయ్ అండ్ ద హెరాన్ , " ద విండ్ రైజెస్ " వంటి పిక్స్ తో స్టూడియో ఘిబ్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  అయితే ఈ పిక్స్ లో విజువల్ టైప్ , వాటర్ కలర్స్ లాంటి నేపథ్యాలు , ఆహ్లాదకరమైన లైటింగ్ , ఫాంటసీ అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్ జెమినీ ఉపయోగించి తమ పిక్స్ ను ఫ్రీ గా మార్చుకోవచ్చు.


*ఎలా చేయాలంటే...
* గూగుల్ జెమినితో మీ చిత్రాలను ఘిబ్లీ-శైలి యానిమే కళగా ఛేంజ్ చెయ్యడానికి స్టప్ బై స్టప్ చూసేద్దాం.


1. గూగుల్ జెమిని ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లండి (gemini.google.com) లేదా iOS లేదా Androidలో జెమిని యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. ఇది చెయ్యాలంటే గూగుల్ లో ఫస్ట్ అకౌంట్ లో ఉండాలి.


2. అప్‌లోడ్ ఆప్షన్ ను క్లిక్ చేసి సాధారణంగా ఒక పేపర్‌క్లిప్ లేదా కెమెరా చిహ్నంతో ఈ ఆప్షన్ కనిపిస్తుంది.  తర్వాత మీకు కావాల్సిన పిక్ ను సెలక్ట్ చేసుకోవాలి. హై రిజల్యూషన్ చిత్రాలయితే మరీ మంచింది. ఘిబ్లీ అవుట్ పుట్ ఇంకా బాగా వస్తుంది. 


3. "ఈ ఫోటోను మృదువైన పాస్టెల్ రంగులు, డ్రీమీ బ్యాక్ గ్రౌండ్ తో స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమేగా మార్చండి" అని కమెండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అడిషనల్ కస్టమైజేషన్ కోసం " బ్యాక్ గ్రౌండ్ సెలక్ట్ చేసుకొండి. 


4. "స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమే కళను సృష్టించు" అని టై ప్ చేస్తే బెస్ట్ కలర్ , బ్యాక్ గ్రౌండ్ ను సెలక్ట్ చేసుకుంటే ...బెస్ట్ రిజల్ట్ వస్తుంది.పిక్ ను బెస్ట్ గా రావాలంటే లైట్ కలర్ పేస్టల్ కలర్స్ సెలక్ట్ చేస్తే అధ్భుతంగా ఉంటుంది.మీరు ఈ ప్రాసెస్ అంతా ల్యాప్ టాప్ లో చెయ్యండి . లేదంటే ఫోన్ లో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ .
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu google-voice

Related Articles