. 2030 నాటికి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాలా అభివృధ్ధి చెందుతుందని ,ఏఐ రూపాంతం చెందుతుందని తెలిపింది. గూగుల్ డీప్ మైండ్ తన పరిశోధనా పత్రంలో తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏఐ తో రోజు రోజు క్రైమ్ లెవెల్ పెరుగుతుందంటుంది గూగుల్ . ఈ టెక్నాలజీ మనుషుల మనుగడకే ప్రమాదంగా మారుతుందని టెన్షన్ పడుతుంది. ఈ అందోళన తొందర్లోనే నిజం కాబోతుంది . గూగుల్ డీప్ మైండ్ తన పరిశోధనా పత్రంలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది. 2030 నాటికి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాలా అభివృధ్ధి చెందుతుందని ,ఏఐ రూపాంతం చెందుతుందని తెలిపింది. గూగుల్ డీప్ మైండ్ తన పరిశోధనా పత్రంలో తెలిపింది.
ఈ వెర్షన్ మనుషులను మించిపోతుందని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పరిమితులను అధిగమిస్తుందని తెలిపింది. ఏఐకి మానవ తెలివితేటలు రావడంతో పాటు మానవులతో సమానంగా పనిచేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అభివృధ్ధి చెందుతుందని పేర్కొంది. ఏఐని దుర్వినియోగం చేస్తూ ఇతరులకు హాని కలిగించేందుకు ఉపయోగించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.డీప్ మైండ్ పరిశోధనా పత్రంలో వెల్లడించిన వివరాలప్రకారం ఏఐతో మంచి కంటే ..మిస్ చూజ్ , మిస్ అలైన్ మెంట్ , మిస్టేక్స్ , స్ట్రక్చరల్ రిస్క్ లాంటి అంశాలతో ఏజీఐతో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.డెవలపర్లు భద్రతా ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. మనుషులకు ముప్పు కలిగించే పనులకు సంబంధించి ఏజీఐ సామర్థ్యాన్ని పరిమితం చేయాలని పేర్కొంది.