గతంలో స్కూళ్లకు వచ్చే ఫండ్స్ ద్వారా కరెంట్ బిల్లులను చెల్లించే వారు. కొన్ని సార్లు ఫండ్స్ ఆలస్యం కావడంతో బిల్లులను చెల్లించడం ఆలస్యం అయ్యేది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ గోవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్కూళ్లకు వచ్చే ఫండ్స్ ద్వారా కరెంట్ బిల్లులను చెల్లించే వారు. కొన్ని సార్లు ఫండ్స్ ఆలస్యం కావడంతో బిల్లులను చెల్లించడం ఆలస్యం అయ్యేది.
దీంతో స్కూళ్లకు కరెంట్ కట్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ కరెంట్ నిర్ణయంతో స్కూల్ యాజమాన్యాలకు ఈ తంటా తప్పింది. ఇక నుంచి స్కూళ్లకు వచ్చే కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దీని కోసం రాష్ట్ర DISCOMS ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయనుంది. అయితే, సెలెక్ట్ చేసిన కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే ఈ విధానం వర్తించనుంది. త్వరలోనే దీనికి సెలెక్ట్ అయిన విద్యాసంస్థల జాబితాను DISCOMS పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.