Herbal Tea : ఈ టీలు తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి

పాలు , చక్కెర వేసిన టీ కంటే ఈ హెర్బల్ టీ తాగితే మీకు ఆరోగ్యానికి కూడా మంచిదే. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ లో ఉంది. ఐదు రకాల టీలు ఉన్నాయి..వాటిని రోజుకు ఒక టీ చేసుకుంటే సరి.


Published Jul 22, 2024 09:13:00 PM
postImages/2024-07-22/1721663021_greenblackorherbalteaherearedifferentteatypesandhowtopicktherighttypeforyou.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా మంది తెల్లారే..కూసింత కాఫీ గాని ...కాసింత టీ చుక్క కాని పడకపోతే ..తాగినోడి కంటే దారుణంగా అయిపోతుంటారు.వాళ్లకి బుర్ర పనిచెయ్యదు. ఏం జరుగుతుందో..టీ తాగే వరకు మామూలు మనుషులు కాలేరు. అయితే పాలు , చక్కెర వేసిన టీ కంటే ఈ హెర్బల్ టీ తాగితే మీకు ఆరోగ్యానికి కూడా మంచిదే. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ లో ఉంది. ఐదు రకాల టీలు ఉన్నాయి..వాటిని రోజుకు ఒక టీ చేసుకుంటే సరి.


* పిప్పర్‌మెంట్ టీ..
ఈ పుదీనా టీలో కూడా కెఫిన్ ఉండదు. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ టీని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఈ టీ చెయ్యడం చాలా సింపుల్ ..నాలుగు పుదీనా ఆకులు ..వేడి నీటిలో వేసి మరిగించండి..ఆ నీటిని తేనె తో తీసుకుంటే సరి..


*​మందార టీ..
ఈ టీలో ఎలాంటి కెఫిన్ ఉండదు. దీనిని తాగితే రక్తంలో షుగర్ లెవల్స్‌పై పాజిటీవ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. షుగర్, బీపి ఉన్నవారికి ఇది ఔషధమని చెప్పొచ్చు. ఇది కూడా ఇంచుమించు ఇదే ప్రాసెస్ . వేడి నీటిలో మందార రేకులు వేసి మరిగించి తేనె కలుపుకొని తాగితే సరి.


* అల్లం టీ..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన అల్లాన్ని తీసుకుంటే మన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి, షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. అల్లం టీ వల్ల మీకు జీర్ణశక్తి సమస్యలు కూడా తగ్గుతుంది. 


* దాల్చిన చెక్క టీ..
దాల్చిన చెక్కలో మన ఇన్సులిన్ సెన్సెటివిటీని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో టీ తయారు చేసుకుని తాగొచ్చు. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల పీసీఓడీ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.


* బ్లాక్ టీ..
ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. బ్లాక్ టీ అంటే దాదాపు..డికార్షన్...జస్ట్ టీ పొడి మరిగించిన నీరుమాత్రమే. చిన్న తేనె వేసుకొని తాగాలి.


* గ్రీన్ టీ..
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ గ్రీన్ టీని తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరగవుతుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. గ్రీన్ టీ తాగేవారికి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. వెయిట్ లాస్ కు పక్కాగా వాడే టీ ఇదే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news

Related Articles