తొలి సినిమా 'రెండు జళ్ల సీత' వాయిదా పడుతూనే ఉంది. ఏ ఇండస్ట్రీ లో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో కీర్తికి ఐరన్ లెగ్ ట్యాగ్ పడింది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 'మహానటి' సినిమాతో ఈ తరం హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్న కీర్తి సురేశ్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రోజే కీర్తి సురేశ్ హ్యాపీ బర్త్ డే ...ఆవిడ సినిమాలు ..కెరియర్ కష్టాలు ఎప్పుడు మాట్లాడుకుంటునే ఉంటాం. సో ...ఇప్పుడు కొత్తగా తన ఆస్తులు ..కూడా తన ఎచీవ్ మెంట్సే.. సో వాటి డీటైల్స్ చూద్దాం.
'పైలట్స్' అనే మళయాల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు కీర్తి. కీర్తి కి సినిమాలు ఏం అంత ఈజీగా రాలేదు . దాదాపు మూడు సినిమాలల్లో హీరోయిన్‌గా ఎంపికై, అనంతరం ఆ చిత్రాల షూటింగ్‌లు ఆగిపోవడంతో లాంచింగ్ కష్టమైంది. చివరికి గీతాంజలి తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత రింగ్ మాస్టర్ కాస్త ఇండస్ట్రీ లో తన పేరును కాస్త సేఫ్ జోన్ లో పెట్టుకుంది.
అలా అని తమిళ్ అని అడుగు పెడితే అక్కడ మళ్లీ కష్టాలే. తొలి తమిళ సినిమా 'ఇదు ఎన్న యామమ్' ప్లాప్. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి సినిమా 'రెండు జళ్ల సీత' వాయిదా పడుతూనే ఉంది. ఏ ఇండస్ట్రీ లో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో కీర్తికి ఐరన్ లెగ్ ట్యాగ్ పడింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత తెలుగులో 'నేను శైలజ'తో మంచి సక్సెస్ అందుకున్నారు కీర్తి సురేశ్. అలా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో డైరక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి చేసి నేషనల్ అవార్డును అందుకుంది.
ఇక అక్కడ నుంచి కీర్తి కెరియర్ టర్న్ అయిపోయింది. ఐరన్ లెగ్ కాస్త మా సినిమాల్లో మీరే ఉండాలనే స్థాయికి చేరుకుంది. 'సామి స్క్వేర్', 'పందెం కోడి 2', లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అయిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత 'దసరా', 'మామన్నన్'తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. రీసెంట్‌గా 'సైరన్', 'రఘు తాత' సినిమాల్లో కనిపించిన కీర్తి, 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి', 'ఉప్పు కప్పురంబు' సినిమా లతో పాటు ..బాలీవుడ్ లో ను సినిమాలు చేస్తుంది.ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు, ఒక యాడ్ కోసం రూ.30 లక్షలు, సోషల్ మీడియాలో ఒక పోస్టు కోసం రూ.25 లక్షలు ఛార్జ్ చేస్తుంటారట. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.41 కోట్లకు పైమాటే అని ఇంగ్లీష్ కథనాల్లో రాసి ఉంది. అవి కాకుండా కీర్తి గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు నాలుగు ఉన్నాయి.