samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరో సారి రియాక్ట్ అయిన సమంత !

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల నటి సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


Published Oct 17, 2024 12:46:00 PM
postImages/2024-10-17/1729149479_SamanthaRuthPrabhu17210348435181721034843678.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల నటి సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సమంత తరుపున చాలా మంది సీరియస్ అయ్యారు.తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా కొండసురేఖ వ్యాఖ్యలపై నటి మరో సారి రియాక్ట్ అయ్యింది. తన లేటెస్ట్ వెబ్ సీరిస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆమె దీనిపై మాట్లాడారు. 


ఎంతోమంది మద్దతుతో నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు నాపై ఉన్న నమ్మకం, వారు నాపై చూపించే ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. వారంతా నాలో ధైర్యం నింపారు. సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి వారి నెగిటివ్ మాటలు నేను పట్టించుకోను. వారంతా నా వెంట నిలబడకపోయుంటే నేను ఈ రోజు ఇక్కడ కూర్చోలేను.


ఆన్ లైన్ లో ట్రోలింగ్స్ పైనా సమంత స్పందించారు. అలాంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని తెలిపారు. అసలు నెగిటివ్ మాటలు .. నేను మైండ్ వరకు తీసుకురాను. దాని ఇంపాక్ట్ నా కెరియర్ పై పడుతుందంటే నేను దానికి దూరంగా ఉంటాను. ఇక ఆలోచించను కూడా. బాలీవుడ్​ దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన 'సిటాడెల్‌ : హనీ బన్నిలో వరుణ్​ ధావన్​, సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. అమేజాన్ ప్రైమ్ లో  నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సీరిస్ అందుబాటులో స్ట్రీమింగ్ అవ్వనుంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha citadel konda-surekha

Related Articles