నిజానికి మహిళలకే కాదు...పురుషులకు చిన్నారుల నుంచి ఒక్కో వయసుకు ఒక్కో రకమైన పోషకాహారం తీసుకోవాలి. అసలు పోషకాహారం తీసుకుంటున్నారో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రతి వయసుకు ఓ ఆహారం తీసుకోవల్సిన సమయం ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఆ ఫుడ్ మెను ఉంటుందా..చిన్న పెద్ద అందరు ఆ ప్యాకెట్ ఫుడ్డే తింటున్నారు. నిజానికి మహిళలకే కాదు...పురుషులకు చిన్నారుల నుంచి ఒక్కో వయసుకు ఒక్కో రకమైన పోషకాహారం తీసుకోవాలి. అసలు పోషకాహారం తీసుకుంటున్నారో చూద్దాం.
* ఎదిగే ఆడపిల్లలకు ప్రొటీన్ ఎక్కువగా అవసరముంటుంది. కానీ, ఈ జనరేషన్ పిల్లలు ఇష్టపడే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉంటున్నాయి. దీని వల్ల వెయిట్ పెరిగిపోతారు.
* మీరు తినే ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం వల్ల చిన్న వయసులోనే రుతుక్రమం ఆరంభం అవుతుంది. ఇలా కా కూడదంటే వారికిచ్చే డైట్‌లో ఎగ్స్, ఆకు కూరలు, తాజాపండ్లు, ఆకుపచ్చని కూరగాయలతో పాటు నట్స్, వేరుశనగ, గోధుమలు, పెసలు వంటి పదార్థాలు ఉండేలా చూడండి. దీని వల్ల మీ పిల్లలకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఏ సమస్య రాకూడదంటే ఇవి తినాల్సిందే.
* ఫ్రూట్ సలాడ్, నువ్వులు, డ్రైఫ్రూట్స్ లడ్డూలు వంటివి ఇస్తే మంచిది. స్నాక్స్ అంటే మొలకల చాట్, సెనగలు, బొబ్బర్లతో చేసిన వడలు లాంటివి రుచి చూపించండి. ఇవి పిల్లల బోన్స్ స్ట్రాంగ్ గా చేస్తుంది.
*15-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీనేజీ వయస్సు మొదలుకుని ముప్పైల వరకూ మహిళల జీవితంలో కీలకదశ. పప్పుధాన్యాలు, నట్స్, పండ్లు, ఫిష్, సోయాలను తగు మోతాదులో తీసుకోవాలి. తృణధాన్యాలు, లోఫ్యాట్ ప్రొడక్ట్స్, ఆకుపచ్చని కూరగాయలు తినాలి. రక్తహీనత రాకుండా పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చ కూర, తోటకూర బీన్స్, కాయధాన్యాలు వంటి ఐరన్ పుష్కలంగా ఉండే వాటిని డైట్లో చేర్చుకోవాలి. ఇది మీరు టీనేజ్ నుంచి 30 వరకు ఈ ఫుడ్ సరిపోతుంది.
* 30-40 ఏళ్ల వయసువారు ..ఇవి గుడ్లు, బీన్స్, నట్స్ - సీడ్స్ లభిస్తాయి. పండ్లు కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లోనూ తగుమొత్తంలో ఉంటాయి.
*40-60 ఏళ్ల వయసులో చాలామంది మహిళల్లో 45-55 ఏళ్ల మధ్య మెనోపాజ్ దశఅనేది ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, అలసట, ఒత్తిడి, నీరసం, వెజైనా పొడిబారిపోవడం వంటివి జరుగుతాయి. సో మీకు మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమవుతాయి.
* 60 నుంచి ఎంత తక్కువ భోజనం చేస్తే అంతమంచిది. తేలికగా అరిగిపోయేది తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది.